Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సరికొత్త వందేభారత్ రైళ్లలో ఈ ఫీచర్లు గమనించారా?

new vande bharat sleeper coach unveiled stunning images
Advertisement
  • త్వరలో పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్
  • బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో వందేభారత్ స్లీపర్ వెర్షన్ రైలును పరిచయం చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • సౌకర్యం, రక్షణ, కొత్తదనానికి చిరునామాగా ఉంటాయని వెల్లడించిన కేంద్ర మంత్రి
Advertisement
భారత రైల్వే వ్యవస్థ రోజురోజుకూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లే అమోఘం అనుకుంటుంటే .. త్వరలో అంతకు మించి ఆకర్షణీయంగా వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కబోతున్నది. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌‌ప్రెస్ రైలు సౌకర్యం, రక్షణ, కొత్తదనానికి చిరునామాగా ఉంటాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.  భారత్ ఎర్త్ మువర్స్ లిమిటెడ్, బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సొమన్న వందేభారత్ స్లీపర్ వెర్షన్ రైలును పరిచయం చేశారు. ఈ రైలుకు సంబంధించిన ఫోటోలను మంత్రి షేర్ చేస్తూ రైలు ప్రత్యేకతలు వివరించారు. 

దూర ప్రాంతాలకు వెళ్లే వారి (లాంగ్ జర్నీ) కోసం ఈ రైలును తెస్తున్నారు. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వెళుతుంది. ఈ రైలుకి 16 కోచ్ లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ త్రీ టైర్, 4ఏసీ టూ టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. మొత్తం 823 ప్రయాణీకుల బెర్తులు ఉంటాయి. ఈ రైలులో అడ్వాన్స్డ్ లైటింగ్ అదిరిపోతుంది. యూఎస్ బీ చార్జింగ్ ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేకంగా డాగ్ బాక్స్ కూడా ఉంటుంది. ప్రతి డైనింగ్ ట్రైలర్ కోచ్ లో లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం (స్పేస్) ఉంటుంది. 

ఈ రైలులో భారీ, మీడియం, స్మాల్ పాంట్రీస్ లో తాజా లంచ్, డిన్నర్ అందుబాటులో ఉంటుంది. తినేందుకు వీలుగా రైలులో స్థిరమైన, మడతపెట్టేందుకు వీలుగా ఉండే స్నాక్ టేబుల్స్ ఉంటాయి. అందువల్ల డైనింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈఎస్ 45545 ప్రకారం అగ్ని భద్రత, ప్రమాదాలను నిరోధించే సదుపాయం ఉంది. దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్లు, ఆటోమేటిక్ బాహ్య ప్రయాణీకుల తలుపులు, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ తలుపులు, ఎండ్ వాల్ వద్ద రిమోట్ గా పని చేసే ఫైర్ బారియర్ డోర్లు, సమర్థతాపరంగా రూపొందించిన వాసన లేని టాయిలెట్ వ్యవస్థ, పబ్లిక్ ప్రకటన – దృశ్య సమాచార వ్యవస్థ వంటి ఫీచర్ లు ఈ ట్రైన్ లో ఉన్నాయి.
Advertisement
Advertisement
Vande Bharat Sleeper Coach
national news

More Telugu News